భార‌త్ ప్ర‌ధాని కోసం సూప‌ర్ విమానం సిద్ధ‌మ‌వుతోంది. అత్యాధునిక టెక్నాల‌జీతో ఈ విమానాన్ని త‌యారు చేస్తున్నారు. ప్ర‌స్తుతం బోయింగ్ 747 విమానాన్ని భార‌త ప్ర‌భుత్వం వినియోగిస్తోంది. ఇందులోనే రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్ర‌యాణిస్తుంటారు. అయితే.. దీని స్థానంలో బోయింగ్-777 విమానాన్ని తీసుకొస్తున్నారు.  ఇది అత్యంత సాకేంతిక విలువ‌ల‌తో కూడుకుని ఉండే క‌స్ట‌మ్ మేడ్ విమానట‌.  ప్ర‌స్తుతం ఉన్న బోయింగ్-747 విమానాన్ని సాధార‌ణ పైల‌ట్లు న‌డిపుతున్నారు. అయితే.. ఇప్పుడు రాబోయే బోయింగ్-777 విమానాన్ని మాత్రం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ పైల‌ట్లు న‌డుప‌నున్నారు. ఇందులో కోసం ఐదుగురు పైల‌ట్ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు.

 

ఇక ఇది అత్యంత సుర‌క్షిత‌మైన‌దిగా ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. దీంట్లో కౌంట‌ర్ ఇన్‌క‌మింగ్ ఇన్‌ఫ్రారెడ్ సిస్ట‌మ్‌, సెల్ఫ్ ప్రొటెక్ష‌న్‌, యాంటీ క్షిప‌ణి‌, కంట్రోల్ ఇంట‌ర్‌సేఫ్ యూనిట్‌, ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్ ఇలా అనేక అత్యంత ఆధునిక టెక్నాల‌జీతో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఇందులో పొందుప‌ర్చుతున్నారు. రానున్న రోజుల్లో భార‌త అగ్ర‌నేత‌ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికే బోయింగ్-777 విమానాన్ని సిద్ధం చేస్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. శ‌త్రువుల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండేందుకే బోయింగ్-777 విమానాన్ని రెడీ చేయిస్తున్నారు. ఇక ఈ విమానం 2022లో అందుబాటులోకి రానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: