భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. వ‌ర‌ల్డ్ మీట‌ర్ డేటా ప్ర‌కారం.. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 31787 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 1,008 మంది మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మహారాష్ట్రలో 9,318, గుజరాత్ లో3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్ లో 2,368, రాజస్థాన్ లో 2,383, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (2,043, తమిళనాడులో 2,058 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

గ‌త రెండు రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1300పైగా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  3,163,190 మందికి కరోనా సోకింది.  219,332 మంది క‌రోనాతో మరణించారు.  అమెరికాలో మరణాల సంఖ్య 59,000 దాటింది. 1,035,765 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ లో 232,128, ఇటలీలో 201,505, ఫ్రాన్స్ లో 165,911, యూకేలో 161,145) కేసులు న‌మోదు అయ్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: