జిరాఫీ.. జంతువుల్లో ఎంతో ప్ర‌త్యేక‌మైనది... చాలా ఎత్తుతో చూసేందుకు కొత్త‌గా వింత‌గా ఉంటుంది. అయితే.. ఆక‌లిమీదున్న సింహాల‌కు జిరాఫీ కంట‌ప‌డింది. దానిని చీల్చుకొని తిన‌డానికి ఐదు సింహాలు, ఐదు గంట‌లపాటు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాయి. అయితే.. జిరాఫీ మాత్రం లొంగిపోలేదు. చాలా ఓపిక‌తో త‌ల‌దించ‌కుండా అలాగే నిల్చున్న‌ది. ఈ సింహాలు ఎలాగైనా జిరాఫీని ప‌డేయాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో వెనుక‌నున్న రెండు కాళ్ల‌ను రెండు సింహాలు ప‌ట్టుకొని నోటితో పీక్కుని తిన‌డం మొద‌లుపెట్టాయి. అయినా.. జిరాఫీ ఏమాత్రం చ‌లించ‌లేదు.

 

సింహాలు ఎంత ప్ర‌య‌త్నించినా.. కింద ప‌డ‌క‌పోవ‌డంతో ఒక సింహం ఏకంగా చెట్టు ఎక్కిన‌ట్లుగా జిరాఫీ పైకి ఎక్కింది. కానీ.. దానిని ఏమీ చేయ‌లేక‌పోయింది. ఇలా ఐదు గంట‌ల‌పాటు దానిని చంపేందుకు ప్ర‌య‌త్నించిన సింహాలు చివ‌ర‌కు అక్క‌డి నుంచి వెళ్లిపోయాయి. ఇక ఎంతో స‌హ‌నంతో ఉన్న జిరాఫీనే చివ‌ర‌కు విజ‌యం సాధించింది. సింహాల‌ను  చూసి ప‌రుగులు తీయ‌కుండా.. త‌న‌దైన శైలిలో వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ప్రాణాల‌ను కాపాడుకుంది జిరాఫీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: