దేశంలో రోజు రోజుకీ కరోనా ప్రభావ పెరిగిపోతూనే ఉంది.   అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువ అవుతుందని ప్రకటిస్తున్నారు.  ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.  సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కరోనా ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి.

 

తెలంగాణలో ఇప్పటి వరకు 25 మంది మరణించారు. ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 409కి చేరింది. నిన్న డిశ్చార్జ్‌ అయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నారు.  ప్రస్తుతం 582 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

 

10 మందిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న 23 రోజుల బాబుకు నెగిటివ్‌ రావడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఈ 8 జిల్లాలకు చెందిన పాజిటివ్‌ కేసులున్న వారందరికీ వ్యాధి నయమై వెళ్లిపోయారు. దీనితో కరోనా రహిత జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: