తెలంగాణ పోరాటంలో ఎంతో త్యాగధనులు తమ ప్రాణాలు అర్పించారు. ఎంతో మంది జైళ్లకు వెళ్లి తమ పోరాటాన్ని అక్కడ కూడా కొనసాగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రతి తెలంగాణ పౌరుడికి కదలిక వచ్చింది.  ఇక బుధవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు హంగు, ఆర్భాటాలు లేకుండా జరిగిన వేళ, పార్టీ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఉద్యమకాలం నాటి జైలు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన 'ఖైదీ గుర్తింపు కార్డు'  ఫోట తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటున్న వేళ, నా మిత్రుడొకరు దీన్ని పంపించారు. దీక్షా దివస్ రోజున... అంటే, నవంబర్ 29, 2009న కేసీఆర్ గారితో పాటు నేను, జయశంకర్ సార్ అరెస్ట్ అయ్యాము. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు. ఆయనకు  వరంగల్‌ కేంద్ర కారాగారంలో కేటీఆర్ ‌కు 3077 నంబరును కేటాయించారు. ఈ రిసిప్ట్ పై అన్ని వివరాలు రాసి ఉన్నాయి.  తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: