ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ముంబాయి  ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. రిషీ కపూర్ మరణంపై బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది.  1970 చిత్రం మేరా నామ్ జోకర్ (1970)  బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత బాబి మూవీతో హీరోగా మారారు.  కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ను ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఈ విషయాన్నీ ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే.

 

పెద్దపేగులో ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ మరణించిన బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ నిన్న మరణించారు అన్న సంగతి మరవకముందే.. ప్రముఖ ప్రముఖ నటుడు రిషి కపూర్ అనారోగ్యంతో కన్నుమూయడం అందరి హృదయాలను కలచి వేస్తుంది. తాజాగా రిషీ కపూర్ మరణంపై ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అమితాబచ్చన ఒక్కసారే షాక్ తిన్నానని.. మంచి స్నేహితుడుని కోల్పోయానని.. ఇప్పటికీ నమ్మలేక పోయని ఈ వార్త విని కుప్పకూలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: