ఓ వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోన్న వేళ ఎవ‌రికి వారు జీవితం ఎలా గ‌డ‌పాలా బాబు అని తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో సైతం క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో సీఎం కేసీఆర్ అక్క‌డ ప‌రిస్థితి క‌ట్టుదిట్టం చేశారు. అయినా క‌రోనా వ్యాప్తి మాత్రం ఆగ‌డం లేదు. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తెలంగాణ‌లో ఇప్పుడు వీథి కుక్క‌ల‌కు సైతం క‌రోనా సోకింద‌న్న వార్త‌లు ప్ర‌తి ఒక్క‌రిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని మాన‌వ‌పాడు మండ‌లంలో కొన్ని చోట్ల వీథి కుక్క‌లు వ‌రుస‌గా ద‌గ్గుతుండ‌డంతో పాటు చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. దీంతో ఈ వీథి కుక్క‌ల‌కు కూడా క‌రోనా సోకింద‌న్న వార్త‌లు రావ‌డంతో ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగింది.

 

కొంద‌రు గ్రామ‌స్తులు భ‌యంతో జిల్లా వెట‌ర్నీరి అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు వ‌చ్చి ప‌రిశీలించి.. వీటికి గొంతు వాపు వ్యాధి వ‌చ్చింద‌ని నిర్దారించారు. గ్రామ స‌మీపంలోని ఓ కోళ్ల ఫారంలో వ్య‌ర్థాల‌ను కుక్క‌లు తిన‌డం వ‌ల్ల గ్రామంలోని కుక్క‌లు అన్నింటికి ఈ వ్యాధి వ‌చ్చింద‌ని.. ఇది క‌రోనా అని అపోహ‌లు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. చివ‌ర‌కు వెట‌ర్నీరీ అధికారులు ఈ కుక్క‌ల‌కు యాంటీ బ‌యాటిక్స్ వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: