జాతీయ స్థాయిలో ఏపీ మ‌రో రికార్డు సాధించింది. క‌రోనా క‌ట్ట‌డికి క‌ట్టుడిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న ఏపీ స‌ర్కార్‌.. ఆ దిశ‌గా మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఎంత వేగంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లుచేస్తే.. అంత వేగంగా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చున‌న్న శాస్త్రీయ‌ప‌ద్ధ‌తిలో సొంతంగా కిట్ల త‌యారీతోపాటు దక్షిణ‌కొరియా నుంచి ప్ర‌త్యేకంగా ల‌క్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను తెప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇటీవ‌ల ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెల్ల‌డించారు. తాజాగా.. ఇప్ప‌టివ‌ర‌కు 94, 558 కరోనా పరీక్షలు నిర్వహించిన ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలించిందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్ల‌డించారు. అంతేగాకుండా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా మరణాలు కూడా నమోదు కాలేదు.

 

అలాగే ఇన్ఫ్‌క్షన్‌తోపాటుగా, మరణాల రేటు కూడా చాలా వ‌ర‌కు తగ్గింది. ఇది చాలా మంచి ప‌రిణామ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. వేగంగా జ‌రుగుతున్న‌ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు వైర‌స్ వ్యాప్తిని అడ్డుకుంటాయ‌ని చెబుతు్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1403కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్‌ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ అయిందన్నారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 మంది కరోనా బాధితులు చికిత్స  పొందుతున్నారని వెల్లడించారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 4, వైఎస్సార్‌ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 43, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: