ఆరోగ్య సేతు యాప్ కోవిడ్-19  గురించిన సమాచారం యూజర్స్ కి తెలియజేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యాప్  తప్పనిసరిగా వాడాలని చెబుతోంది. ఈ విషయమై లాక్ డౌన్ తర్వాత జరిగే విక్రయాల్లో ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ఈ క్రమంలో ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ యాప్ ను విధిగా చేర్చాలని కేంద్రం సూచించింది.  

IHG

 

 

స్మార్ట్ ఫోన్ లలో ముందుగా ఈ  యాప్ ను చేర్చడం ద్వారా కరోనా బాధితులు ఎక్కడున్నా సరే వీరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. మరియు కొత్త యూజర్లు తమ డిటైల్స్ అందులో ఇవ్వడం ద్వారా వారు రిజిస్ట్రేషన్ చేసుకొంటారు.  ఆరోగ్య సేతు యాప్  ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ 7.5 కోట్ల మంది ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నారు. అయితే దేశంలో అధిక శాతం ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న సంగతి  తెలిసిందే.  ఇప్పటివరకూ ఐదు కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ ఆరోగ్య సేతు యాప్ ను  డౌన్లోడ్ చేసుకున్నారు మరియు  సంబంధిత సమాచారాన్ని పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: