IHG

 భారత్ లోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కరొనతో తీవ్ర  సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకుగాను తమ ఉద్యోగుల  జీతాలలో కోత విధించడానికి సిద్ధమైంది. ఉద్యోగుల వేతనాలు దాదాపు 10 శాతం నుంచి 50 శాతం వరకు కోత విధించినట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. అయితే ఈ కోత ఉద్యోగుల స్థాయిని బట్టి కుదించారు. ఎవరికైతే వార్షిక వేతనం రూ. 15 లక్షల కంటే తక్కువ ఉంటుందో వారికి  మినహాయింపు ఇచ్చారు. వార్షిక ఆదాయం 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ లీడర్ల వేతనాల్లో దాదాపు 30 నుంచి 50 శాతం వరకూ కొత్త విధించారు.  అయితే ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ తన వార్షిక పారితోషకాన్ని పూర్తిగా వద్దనుకున్న ట్లు రిలయన్స్ కంపెనీ ప్రముఖులు ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: