స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  ‘పుష్ప’లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. చిత్తూరు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సుకుమార్అల్లు అర్జున్ కాంబినేషన్ వ‌స్తున్న మూడో సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇండియా వైడ్ ట్రెండ్ అయింది. దీంతో అంచ‌నాలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ మాస్ లుక్ బాగా ఆక‌ట్టుకుంది. ఎర్రచందనం చేసే స్మగ్లర్ గా, కాలికి ఆరు వేళ్లు.. ఇలా వెరీ స్పెష‌ల్‌గా ఉంది.  సుకుమార్ మార్క్‌.. ఏదో ఒక సీన్‌లో గుండెల్ని మెలిపెట్టేస్తాడు.. ఎమోషనల్ టచ్ అంతలా ఉంటుంది. అయితే.. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి సంబందించిన ఓ కీ పాయింట్ లీకైంది. 

 

ఈ సినిమాలో చిన్నతనంలోనే అల్లు అర్జున్ తన కుటుంబానికి దూరం అవుతాడ‌ట‌. ఆ తర్వాతే స్మగ్లర్ గా మారుతాడట. అలా చాలా డబ్బు సంపాదించాక తన ఫ్యామిలీకి తిరిగి దగ్గర అవుతాడ‌ట‌. ఇక్క‌డే సుకుమార్ మార్క్‌ ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. ఇంకేముంది.. త‌న‌దైన ట్విస్ట్‌ల‌తో సుకుమార్ సినిమాను ముగించ‌డం అంద‌రికీ తెలిసిందే. పాన్ ఇండియా పరంగా అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని సినిమా యూనిట్ ఉంది. మొత్తం 5 భాషల్లో ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: