లాక్‌డౌన్ కార‌ణంగా రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా థియేటర్లు ఓపెన్‌ అవుతాయో లే దో తెలియని పరిస్థితి. థియేటర్లలో కరోనా వ్యాప్తి చాలా స్పీడ్‌గా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో థియేటర్లపై ఆశలు వ దిలేసిన ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో సరైన మంచి వెబ్‌ సిరీస్‌లు రాలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చే సేందుకు అల్లు అరవింద్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

అల్లు అరవింద్‌ ఆహా ఓటీటీని ప్రారంభించి చాలా నెలలు అయ్యింది. కానీ ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. దీంతో ఆహాను జనాల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో క్వాలిటీ కంటెంట్‌ కోసం అల్లు అరవింద్‌ కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఈక్ర‌మంలోనే ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్‌, ప్రముఖ దర్శకులకు అల్లు అరవింద్‌ స్వయంగా కాల్‌ చేసి వెబ్‌ సిరీస్‌ల కోసం మంచి కాన్సెప్ట్‌లు రెడీ చేయమన్నాడట. అలాగే చిన్న చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని, దాన్ని ఓటీటీలో స్ట్రీమ్‌ చేస్తామంటూ చెప్పి స్క్రిప్ట్‌ రెడీ చేసుకు రమ్మన్నాడట.  ఎట్టకేలకు అల్లు అరవింద్‌ వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టడంతో ఇప్పుడైనా క్వాలిటీ కంటెంట్‌ వస్తుందేమో చూడాలి. ఆహాలో క్వాలిటీ వెబ్‌ సిరీస్‌లు వస్తేనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: