గత వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా నిన్న 22 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజలు ఏపీ, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం విధించింది. 
 
ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బలగాలను పెంచి ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు కర్నూలుకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు కృష్ణా, గుంటూరు జిల్లాల వైపు వెళ్లడంపై కూడా నిషేధం విధించింది. 
 
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: