మ‌హారాష్ట్ర‌ను కొవిడ్‌-19 అత‌లాకుత‌లం చేస్తోంది. దేశంలోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు ఈ రాష్ట్రంలోనే సంభ‌విస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ని ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నా... వైర‌స్ మ‌హ‌మ్మారి విస్త‌రిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ది వేలు దాట‌డం ఇక్క‌డి ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. ఇవాళ మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు అయ్యాయ‌ని అధికారులు వెల్ల‌డించ‌డం ఆందోళ‌న క‌ల‌గిస్తోంది. 

 

అటు దేశ‌వ్యాప్తంగా కరోనా వైర‌స్ విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 1,993  కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 8,889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: