లాక్‌డౌన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ గాడిలో పెట్టేందుకు, విదేశీ పెట్టుబడుల‌ను ఆక‌ర్శించేందుకు, దేశీయ పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించేందుకు.. ఎలా ముందుకు వెళ్లాల‌న్న అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయ‌న ఈ విష‌యాన్ని ప‌దేప‌దే చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బాగుచేయ‌డానికి ఏం చేయాల‌న్న‌దానిపైనే ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు. తాజాగా.. కేంద్ర రైల్వే, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి పీయూష్‌గోయ‌ల్‌కు ట్విట్ట‌ర్‌లో ప‌లు సూచ‌న‌లు చేశారు. * మన దేశానికి పెట్టుబడులను ఆకర్షించడానికి మన ఆర్థిక వ్యవస్థను మెరుగుప‌ర్చ‌డానికి చేయడానికి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మైన‌ శక్తినివ్వడానికి కొన్ని సూచ‌న‌ల‌ను ఇవ్వాల‌నుకుంటున్నా. ఇప్పుడు భారతదేశానికి గొప్ప అవకాశం ఉంది. దానిని అందిపుచ్చుకుని ముందుకువెళ్దాం. ఇందుకోసం కీల‌క రంగాల నిపుణుల‌తో ప‌క్కా వ్యూహాన్ని ర‌చించాలి. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, పారిశ్రామిక వేత్త‌లు, బ్యాంక‌ర్లు, ఆర్థిక వేత్త‌లు, ఇత‌ర విధాన నిపుణుల‌తో క‌లిసి స‌మ‌గ్ర వ్యూహాన్ని ర‌చించాలి* అని సూచించారు.

 

నిజానికి.. ఇదే విష‌యంపై కొద్దిరోజులుగా కేసీఆర్‌గా ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. గురువారం బేగంపేట టీ ఫైబర్‌ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖ అధికారులతో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ కేటీఆర్ ఇదే విష‌యాన్ని చెప్పారు. కరోనా సంక్షో భం నేపథ్యంలో ప్రపంచంలోని అనేకదేశాలు పెట్టుబడులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఆయా పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: