ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికీ లక్షకు పైగా మరణాలు.. లక్షల్లో కేసు నమోదు అవుతున్నాయి.  ఈ మరణాల్లో మూడో వంతు ఒక్క అమెరికాలోనే కావడం మరీ దారుణమైన విషయం.  భారత దేశంలో కరోనా అరికట్టేందుకు గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇక లాక్ డౌన్ సందర్భంగా బయట ఎవరైనా పరిమిషన్ లేకుండా తిరిగితే బయట తిరిగితే బండ్లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో నిబంధనల ఉల్లంఘనదారులకు సంబంధించిన వాహనాలను సీజ్ చేస్తూ వచ్చిన కర్ణాటక పోలీసులు, వాటిని నేటి నుంచి తిరిగి వెనక్కు ఇచ్చేస్తున్నామన్న శుభవార్తను తెలిపారు.

 

ఇక లాక్ డౌన్ ఉల్లంఘించిన బయట అనవసరంగా తిగిగే వారి విషయంలో కఠినంగా ఉంటామని పోలీస్ బాసులు అంటున్నారు.  ఇప్పటివరకూ 47 వేలకు పైగా వాహనాలు తమ అధీనంలో ఉన్నాయని, వాటి రికార్డులను పరిశీలించి వెనక్కు ఇస్తామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన బెంగళూరు సీపీ భాస్కర్ రావు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. 

 

కాగా, లాక్ డౌన్ ముగిసేంత వరకూ సీజ్ కాబడిన వాహనాలను వెనక్కు ఇవ్వబోమని గతంలో పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిని కోర్టు ద్వారానే విడిపించుకోవాల్సి వుంటుందని కూడా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వాహనదారులు ఆందోళనకు గురికాగా, వారికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం శుభవార్తను వినిపించినట్లయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: