ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం 4,070 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 33,08,290 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 

 

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 278 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,34,105 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ కొత్తగా 187 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,95,210 ఉండగా, ఇవాళ ఐదుగురు మరణించారు. అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 63,861 మంది మృతిచెందారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: