- జ‌యంతి వేళ
- యువ ఎంపీ రాము నివాళులు


శ్రమైక జీవ‌న సౌంద‌ర్యం వ‌ర్థిల్లిన నేల నుంచి పుట్టిన సాహిత్యం, విప్ల‌వాల ఊట నుంచి పుట్టిన పాట శ్రీ‌శ్రీ క‌విత్వా నికి సంకేతికాలు స్మార‌కాలు..ఈ జ‌యంతి వేళ యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం ట్విట‌ర్ ద్వారా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే..తెలుగు సాహిత్యానికి ఎన్నో విప్ల‌వాత్మ‌క ధోర‌ణ లు అందించి భాష‌ని కొత్త ప‌రవొళ్లు తొక్కించిన మహాక‌వి శ్రీ‌శ్రీ‌కి 110వ జ‌యంతి వేళ సంద‌ర్భాన ఆయ‌న‌కు  నా పాదాభివందనాలు. పోరాటాల పురిటిగడ్డ చైతన్య గీతాల ఉత్తరాంధ్రకు యావత్ తెలుగు ప్రపంచానికి కీర్తి తెచ్చారు. ఇలాంటి ప్రస్థానం మళ్ళీ భారత్లో రాగ లదా? అంటూ  ఉద్వేగ‌పూరిత‌మ‌యిన మాట‌లతో త‌న సందేశం రాశారు. న‌మామి శ్రీ‌శ్రీ‌.. స్మ‌రామి శ్రీ‌శ్రీ 

మరింత సమాచారం తెలుసుకోండి: