ప్రస్తుతం మన తెలుగులో ఉన్న ఛానెల్స్ లో ఆల్ టైం హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ను సంపాదించే ఏకైక సీరియల్ ఏదంటే ప్ర‌తి ఒక్క‌రి నోటు నుంచి వినిపించే మాట కార్తీక‌దీపం. కార్తీక‌దీపం తెలుగు బుల్లితెర రంగంలో ఎన్నో సంచ‌నాల‌కు కార‌ణ‌మైంది. కార్తీక‌దీపం సీరియ‌ల్ వ‌స్తుందంటే చాలు ఆ టైంకు ప్ర‌తి ఒక్క‌రు వ‌య‌స్సుతో సంబంధం లేకుండా టీవీల‌కు అతుక్కుపోయేవారు. టీఆర్పీల ప‌రంగా తెలుగు బుల్లితెర రంగంలో మ‌హామ‌హా షోల‌నే తోసిరాజ‌నీ ఈ కార్తీక‌దీపం తిరుగులేని టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.

 

ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఈ కార్తీక‌దీపం సీరియ‌ల్ టాప్ టీఆర్పీ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ షోకు పెద్ద షాకే త‌గిలింది. ఇప్పుడు మాత్రం ఆ క్రేజ్ తగ్గిపోయింది అని చెప్పాలి. లాక్ డౌన్ ఉన్నప్పటికి ప్రతీ వారం సీరియల్ యావరేజ్ గా మన తెలుగులో టాప్ 2 స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ షో ఏకంగా నాలుగో స్థానానికి ప‌డిపోయింది. 

 

ఇప్పుడు టాప్ ప్లేస్ ఈ టీవీ సొంతం చేసుకుంది. ఈ టీవీ న్యూస్ అత్యధికంగా 8 లక్షలకు పైగా ఇంప్రెషన్స్ తో అనగా తర్వాత రెండు స్థానాలలోనూ జెమినీ టీవీ లోని మహర్షి మరియు విజిల్ సినిమాలు నిలిచాయి. అలాగే మళ్ళీ టాప్ 5 స్థానంలో ఈటీవీ జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ఉంది. దీనిని బ‌ట్టి చూస్తే కార్తీక‌దీపం షోను రిపీట్ చేయ‌డంతో క్రేజ్ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: