లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికులు, కూలీలు త‌మ సొంతూళ్లు వెళ్లేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అప్ప‌గించింది. అయితే.. కేంద్రం నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే ఆల‌స్యం వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్ గుజ‌రాత్‌లో చిక్కుకున్న సుమారు ఐదువేల‌ మంది మ‌త్స్య‌కార్మికుల‌ను తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. వెంట‌నే ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. వారంద‌రినీ క్షేమంగా తీసుకొచ్చి కుటుంబాల చెంత‌కు చేర్చేందుకు సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి.. ఇంత‌వ‌ర‌కు మ‌రే రాష్ట్రం కూడా ఇలా స్పందించ‌లేదు. ఆ బాధ్య‌త‌ల‌ను కేంద్ర‌మే తీసుకోవాలంటూ అనేక రాష్ట్రాలు చెప్పాయి. కానీ, సీఎం జ‌గ‌న్ మాత్రం నేరుగా గుజ‌రాత్ నుంచి మ‌త్స్య‌కారుల‌ను తీసుకొచ్చేందుకు చ‌క‌చ‌కా చ‌ర్య‌లు తీసుకున్నారు.

 

నిజానికి.. అంతకుముందు కూడా జ‌గ‌న్ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్‌రుపానీతో మాట్లాడిన విష‌యం తెలిసిందే. తెలుగు మ‌త్స్య‌కారుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరారు. ఇక కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌గానే.. వారిని తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్న జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. *బగ్గుమనే ఎండలో వందల కి.మీ నడిచి వెళ్తున్న వలస కార్మికుల దయనీయ దృశ్యాలు చూస్తున్నాం. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలన్నీ నిస్సహాయంగా ఉండిపోయాయి. 2 వేల కి.మీ దూరాన గుజరాత్ లో చిక్కుబడిన 5 వేల మంది మత్స్యకారులను తీసుకొచ్చేందుకు సిఎం జగన్ గారు చూపిన చొరవను దేశమంతా ప్రశంసిస్తోంది* అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: