టీం ఇండియాకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. ఈ యేడాది న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్ట్ సీరిస్‌లో టీం ఇండియా క్లీన్‌స్వీప్‌కు గురైంది. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీం ఇండియాకు పెద్ద షాక్ త‌గిలింది. మూడేళ్లుగా టెస్టుల్లో తిరుగులేకుండా టాప్ ప్లేస్‌లో ఉన్న టీం ఇండియా ర్యాంక్ ఇప్పుడు ఏకంగా మూడుకు ప‌డిపోయింది. టీం ఇండియాకు ఇప్పుడు 114 పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఆస్ట్రేలియా(116) అగ్రస్థానానికి చేరగా.. న్యూజిలాండ్ (115) రెండో ర్యాంకును దక్కించుకుంది. ఇండియా త‌ర్వాత స్థానాల్లో ఇంగ్లండ్​, శ్రీలంక, దక్షిణాఫ్రికా ఉన్నాయి. 2016 అక్టోబర్​లో ఐసీసీ టెస్టు నంబర్ వన్ ర్యాంకును భారత్ కైవసం చేసుకోగా.. మూడేండ్ల తర్వాత ఇప్పుడు చేజారింది. 

 

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ను వెన‌క్కి నెట్టిన ఆసీస్ తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లోకి చేరుకుంది. టీ 20ల్లో భారత్ ఓ స్థానం మెరుగుపచుకొని మూడో ర్యాంకుకు చేరుకోగా.. ఇంగ్లండ్​ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ఏకంగా అగ్రస్థానం నుంచి నాలుగో ర్యాంకుకు పడిపోయింది. వన్డే ర్యాంకింగ్స్​లో భారత్ రెండో ర్యాంకును నిలబెట్టుకోగా.. అగ్రస్థానంలో ఇంగ్లండ్, మూడో ప్లేస్‌లో న్యూజిలాండ్ కొన‌సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: