ఏ ముహూర్తంలో దేశంలో లాక్ డౌన్ ప్రారంభించారో కానీ.. ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి.  వివిధ రాష్ట్రాల్లో చిక్కున వలస కార్మికులు, ఇతర ఉద్యోగస్తులు.. జాలర్లు ఒక్కరేమిటి.. శుభకార్యాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కబడిపోయారు.  ఎప్పుడు తమకు విముక్తి కలుగుతుందా అని దేవున్ని వేడుకోవడం.. కొంత మంది ధైర్యం చేసి కాలినడకన నడుస్తూ తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.  ఇక వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లొచ్చు అన్న అనుమతి కేంద్రం ఇచ్చింది.. దాంతో వేల మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.  ఇందుకోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 

 

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు ఆంధ్రాలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ నుంచి ప్రత్యేక బస్సులలో 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులలో ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేటకు చేరుకున్నారు. సరిహద్దులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఇతర అధికారులు మత్స్యకారులకు స్వాగతం పలికారు. 

 

అక్కడ నుంచి వచ్చినవారికి ఆహార సదుపాయం కల్పించి.. ఒక్కొరికీ రూ. 2 వేలు అందిస్తామని తెలిపారు. కాగా మచిలీపట్నం, గూడురు, గుడ్లవల్లేరు, విజయనగరం, శ్రీకాకుళంలకు చెందిన మత్స్యకారులను అధికారులు స్వస్థలాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌లో వారు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వివరించారు. ప్రభుత్వం చొరవ చూపకుంటే తమ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అధికారులకు తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: