క‌రోనా నేప‌థ్యంలో దాదాపుగా నెల రోజుల‌కు పైగా దేశవ్యాప్తంగా వ్య‌వ‌స్థ‌లు అన్ని నెల‌న్న‌ర రోజుల‌కు పైగా మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సంచారం ఎక్కువుగా ఉండే మాల్స్‌, థియేట‌ర్లు అన్నింటిని మూసివేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రికి రిలీఫ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. మే 4 నుంచి షాపింగ్‌ మాల్స్, మద్యం దుకాణాలు, ఇత‌ర వ్యాపార‌సంస్థ‌లు తెరిచేందుకు  సిద్దమైంది. 

 

అయితే ఈ మాల్స్‌, దుకాణాల్లో సామాజిక దూరం పాటించ‌డంతో పాటు మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని చెప్పింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.  15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా కూడా క‌ర్నాక‌ట ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తుది ఆదేశాలు వ‌చ్చాకే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని క‌ర్నాక‌ట అధికారులు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: