క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓ వైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఇప్పటికే రెండుసార్లు లాక్‌డౌన్ పొడిగించారు. ఇక ఎక్క‌డిక‌క్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప్ర‌జ‌ల్లో కొంద‌రు మాత్రం వీటిని పాటించ‌డం లేదు. ఈ క్ర‌మంలోన‌నే క‌రోనా క‌ట్ట‌డికి గోవా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న గోవా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇక‌పై ఫేస్‌కు మాస్క్‌లు లేక‌పోతే పెట్రోల్ పోసేది లేద‌ని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్‌ షాపుల వద్దకు మాస్క్‌లు లేక‌పోతే వారికి రేష‌న్ పోయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేష‌న్ డీల‌ర్లు అంద‌రికి ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: