దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో 1993 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య‌ ఆరోగ్య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ్వార‌ల్ వెల్ల‌డించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య‌ మొత్తం 35,043కు చేరుకుందని తెలిపారు.  అలాగే.. గత 24 గంటల్లో కనీసం 564 మంది కోలుకున్నారని తెలిపారు. భార‌త్ క‌రోనా నుంచి కోలుకునేవారి శాతం 25.37 వద్ద ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. దేశ‌వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర అధికారులు మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కార‌ణంగా చిక్కుకున్న వ‌ల‌స కార్మికులు, కూలీల త‌ర‌లింపున‌కు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కాగా, ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌, గుజ‌రాజ‌త్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ త‌దిత‌ర రాష్ట్రాల్లోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయ‌. 

 

మహారాష్ట్రలో 9915 క‌రోనా వైర‌స్ పాటిజివ్, మ‌ర‌ణాలు 432 సంభ‌వించాయి. గుజరాత్‌లో 4082 పాజిటివ్ కేసులు, 197మంది మ‌ర‌ణించారు. ఢిల్లీలో 3439 పాజిటివ్ కేసులు, 56 మంది మ‌ర‌ణించారు. మధ్యప్రదేశ్‌లో 2,660 కేసులు, 130 మంది మ‌ర‌ణించారు. రాజస్థాన్‌లో 2,438 కేసులు, 51మ‌ర‌ణాలు, ఉత్తర ప్రదేశ్‌లో 2,203 కేసులు, 39 మ‌ర‌ణ‌నాలు, తమిళనాడులో 2,162 కేసులు, 27 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఈ రాష్ట్రాల్లో న‌మోదు అవుతున్న కేసులే దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసుల్లో దాదాపుగా సగానికిపైగ ఉంటున్న‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. కాగా,  ‌ మే 3వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుందా..?  లేక ఎత్తివేస్తుందా..? అన్న దానిపై ప్ర‌జ‌ల్లో ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: