దేశంలో కరోనాని కట్టడి చేయడానికి గత నెల నుంచి లాక్ డౌన్ విధించిన విషయం  తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఎంతో మంది ఇండస్ట్రీని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ తో అన్ని ఇండస్ట్రీలు షట్ డౌన్ అయ్యాయి.  షూటింగ్స్ ఆగిపోయాయి.. రిలీజ్ వాయిదా వేసుకున్నారు.  దాంతో సినీ కార్మికులు కష్టాల్లో పడ్డారు. అయితే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అంతే కాదు సీసీసీ ట్రస్ట్ స్థాపించి పేద కళాకారుల కోసం విరాళం సేకరిస్తున్నారు. సి. సి. సి.   (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) స్థాపించినప్పటి నుంచి ఎంతో మంది విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు.

 

హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.  తాజాగా సినీకార్మికుల్ని ఆదుకునేందుకు సి సి సి కి. ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.

 

అంతే కాదు  ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: