పూరి జగన్నాథ్ సినిమాలో పాత్రలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మరియు నచ్చేలా ఉంటాయి. హీరో క్యారెక్టర్ కి తగ్గట్లు డైలాగ్స్ ఎంచుకుంటారు పూరి. పూరి సినిమాల పేర్లు సెలక్షన్ చాలా వింతగా ఉంటుంది వాటిలో తెలుగు మరియు ఇంగ్లీష్  తిట్లను వాడుతూ ఉంటారు. నిన్న మొన్న రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్  సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే  ఇస్మార్ట్ శంకర్ లో చాలావరకూ బూతు డైలాగులను మ్యూట్ లో ఉంచడం జరిగింది. ఈ బూతు డైలాగులు అతనికి ఎంత ఇష్టమో కూడా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

IHG

 

బూతు డైలాగుల పై పూరి స్పందన తెలియజేస్తూ నాకు బూతులు చాలా అలవాటైన మాటలు, నిజజీవితంలో వాటిని ఎక్కువగా వాడుతూ  ఉంటాను. అలా మాట్లాడుతున్న టైంలో నాకు బూతులు అన్నమాట జ్ఞప్తికి రాదు. అయితే ఈ సందర్భంగా పూరి పవన్ కళ్యాణ్ తో ఆయనకున్న సరదా సన్నివేశాన్ని పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ షూటింగ్ లో ఉన్నప్పుడే నేను ఆ విషయం గమనించకుండా సెట్లోనే బూతులు మాట్లాడే శాను తీరా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని నాలుక కరచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు  చాలా కూల్ గా "నాకు బూతులు మాట్లాడే  వారంటే ఇష్టం ఉండదు కానీ నువ్వు మాట్లాడుతుంటే బాగుంది" అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: