దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే నెల రోజుల‌కు పైగా కొన‌సాగుతోన్న లాక్‌డౌన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మ‌రో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుతం ఉన్న లాక్ డౌన్ ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు ఉండ‌నుంది. ఇక లాక్ డౌన్ మరో రెండు వారాల పొడిగింపు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మే3 నుండి మే 17 దాకా పొడిగింపు ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

 

అయితే కొన్ని మిన‌హాయింపులు కూడా ఇచ్చింది. కంటైన్మేంట్ జోన్ లలో 100 శాతం లాక్ డౌన్..ఆరెంజ్ గ్రీన్ జోన్ లలో సడలింపులు, ఆరెంజ్ జోన్ లో కొన్ని మినహాయింపులు..గ్రీన్ జోన్ లలో పూర్తి కార్యకలాపాలు ఉంటాయి. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..కేసులు తగ్గుదల, పెరుగుదలల బట్టి జోన్లు నిర్ధారించే వెసులు బాటు  ఉంటుంద‌ని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: