పాపం కేజ్రీవాల్‌.. ఆయ‌నొక‌టి అనుకుంటే.. మ‌రొక‌టి జ‌రిగింది..! ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని త‌బ్లిఘీ జ‌మాత్‌లో మ‌ర్క‌జ్ నిర్వ‌హిస్తున్నార‌ని తెలిసికూడా ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అనుమ‌తి ఇచ్చారు.. ఉదారంగా వ‌దిలేశారు..! దాని ఫ‌లితంగానే నేడు దేశం మొత్తం క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింద‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. దీనిని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేజ్రీవాల్ బాగానే ప్ర‌య‌త్నాలు చేశారు. ప్లాన్ కూడా వేశారు. అదేమిటంటే.. దేశంలోనే మొద‌టిసారిగా క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా థెర‌పీ చికిత్స అందించి, వారికి కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌యోగాత్మ‌కంగా న‌లుగురికి ప్లాస్మా థెర‌పీ అందించ‌గా సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ చెప్పారు. విలేక‌రుల స‌మావేశం పెట్టిమ‌రీ ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

 

ఇదే స‌మ‌యంలో వైద్యులు కూడా పిలుపునిచ్చారు. దేశ‌భ‌క్తిని చాటుకోవ‌డానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ప్లాస్మాదానం చేయ‌డానికి ముందుకు రావాల‌ని కోరారు. అయితే.. త‌మ‌పై ప‌డిన ముద్ర‌ను తొల‌గించుకోవ‌డానికి కరోనా నుంచి కోలుకున్న ప‌లువురు త‌బ్లిఘీ జ‌మాత్ స‌భ్యులు ప్లాస్మాదానం చేశారు. అయితే.. ఇంత‌లోనే కేంద్రం షాకింగ్ విష‌యం చెప్పింది. క‌రోనాకు ప్లాస్మా థెర‌పీ ఇంకా నిర్ధార‌ణ కాలేద‌ని, ప్ర‌యోగ‌ద‌శ‌లోనే ఉంద‌ని, స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించ‌క‌పోతే.. ప్రాణాలకే ముప్పు ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. మ‌హారాష్ట్ర‌లో ఈరోజు ప్లాస్మా చికిత్స పొందిన మొద‌టి క‌రోనా బాధితుడు కూడా మృతి చెందాడు. ఈ ప‌రిణామాల‌తో కేజ్రీవాల్ పాన్ల విక‌టించిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: