దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ మ‌రో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మే3 నుండి మే 17 దాకా పొడిగింపు ఉత్వ‌ర్వులు జారీ చేసింది. అయితే కొన్ని మిన‌హాయింపులు కూడా ఇచ్చింది. కంటైన్మేంట్ జోన్ లలో 100 శాతం లాక్ డౌన్..ఆరెంజ్ గ్రీన్ జోన్ లలో సడలింపులు, ఆరెంజ్ జోన్ లో కొన్ని మినహాయింపులు..గ్రీన్ జోన్ లలో పూర్తి ప‌రిమితి ఎత్తివేయ‌డం ఉంటుంది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై రాష్ట్రాలు త‌లో ర‌కంగా స్పందిస్తున్నాయి.

 

అయితే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ఈ విష‌యంలో తాము ఊహించిందే జ‌రిగింద‌ని స‌హ‌చ‌ర మంత్రుల‌తో త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. జ‌గ‌న్ ముందు నుంచి లాక్‌డౌన్ గ్రీన్‌జ‌న్లలో పూర్తిగా ఎత్తివేయాల‌ని.. ఎక్క‌డ అయితే రెడ్ జోన్లు ఉంటాయో అక్క‌డ మాత్ర‌మే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... ఇక ఆరెంజ్ జోన్లలో మిన‌హాయింపులు ఇవ్వాల‌ని కోరుతూ వ‌స్తున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఊహించిందే జ‌రగ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం ఇక‌పై ఇటు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు పాల‌న‌పై పూర్తిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌నుంది. అదే టైంలో ఏపీలో ప్ర‌తిప‌క్షాల‌తో పాటు కొంద‌రిలో మాత్రం అసంతృప్తి చాయ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: