మెగా ఫ్యామిలీ అనే పేరు ఉన్న ప్రతి హీరో మీద భారీగా అంచనాలు ఉంటాయి. భారీ అంచనాల మధ్య మెగా ఫామిలీ నుండి ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆర్య, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, సరైనోడు అలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తన డాన్స్ అంటే పడిచస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతని డాన్స్ కె ఎక్కువ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆర్య సినిమా నుంచి ఇప్పటివరకూ అల్లుఅర్జున్ ప్రతి సినిమాలలో డాన్స్ లో తనదైన ముద్ర వేశాడు.

IHG

టాలీవుడ్ లో కొత్త స్టెప్పులు పరిచయం చేస్తున్నారంటే అది ఒక్కఅల్లు అర్జున్ మాత్రమే. అందుకే ఈ మెగా హీరో ని డాన్సింగ్ స్టార్ గా అభిమానులు చూస్తున్నారు. బన్నీ రీసెంట్ గా అల వైకుంఠ పురం సినిమా లో ఇండస్ట్రీలో పెద్ద హిట్ అందుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీని డాన్స్ ఓరియంటెడ్ సినిమాల గురించి అడిగినప్పుడు తన స్పందనను అల్లు అర్జున్ తెలియజేశాడు. తనకు పూర్తి స్థాయి డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేసే ఆలోచన ఏమీ లేదని చెప్పాడు. ఇంకా డాన్స్ అనేది ఆ సినిమాలో ఓ చిన్న భాగమై ఉంటుందని తెలియజేశాడు. అయితే ఈ సందర్భంగా అభిమానులు కోరుకునే అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేయటమే తనకు ఇష్టమని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: