దేశవాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. లాక్‌డౌన్‌ వల్ల ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళ పోలీస్ వ్యానులోనే శిశువుకు జన్మనిచ్చింది. నార్త్ ఢిల్లీలోని గోపాల్ పూర్ ప్రాంతంలొ నిన్న ఉదయం గర్భిణి పురిటినొప్పులతో బాధ పడుతోందని పోలీసులకు సమాచారం అందింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గర్భిణిని పోలీస్ వ్యానులో ఆస్పత్రికి తరలిస్తుండగా మహిళ మార్గమధ్యంలోనే ప్రసవించింది. మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని పోలీసులు మీడియాకు తెలిపారు. మహిళ ప్రసవానికి సహాయం చేసిన కానిస్టేబుల్ రేషాంను ఉన్నతాధికారులు అభినందించారు. పోలీసులు తల్లీ బిడ్డను తీరత్ రామ్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. 
 
20 రోజుల క్రితం ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాయ్ నగర్‌ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: