ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.. ద‌ర్శ‌కుల్లో ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. క‌థ‌కేకాదు పాట‌ల‌కు ప్రాణం పోసేదాక వ‌దిలిపెట్ట‌డు. అందుకే ఆయ‌న తీసిన ప్ర‌తీ సినిమా దేనిక‌దే స్పెష‌ల్ అన్న‌ట్టుగా ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతగ్యారేజ్‌, భరత్‌ అనే నేను ఈ నాలుగు సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ నాలుగు సినిమాలు కూడా మ్యూజికల్‌గా మంచి హిట్‌ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి 152 సినిమా ఆచార్య‌కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. అందులోనూ చిరంజీవి కావ‌డంతో కొర‌టాల మ‌రింత కేర్ తీసుకుంటున్నాడు. అయితే.. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడానికి కారణం చిరంజీవి అని ఇండ‌స్ట్రీలో టాక్‌. నిజానికి.. కొరటాల మాత్రం ఈసారి కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ చేయించాల‌ని అనుకున్నాడ‌ట‌.

 

కానీ.. చిరంజీవి మాటను కాద‌న‌లేక మణిశర్మతో వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గ‌త గత ఆరు నెలలుగా ఇద్దరు ట్రావెల్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మూడు పాటలు కూడా ఫైనల్‌ కాలేద‌నే టాక్ వినిపిస్తోంది. మణిశర్మ ఎన్ని ట్యూన్స్‌ చేసినా కూడా కొరటాలకు అస్స‌లు నచ్చడం లేదట. కొత్తదనం కావాల‌ని అంటున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఇద్ద‌రిమ‌ధ్య మద్య విభేదాలు వ‌చ్చాయ‌నే ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రెండు పాటలు మణిశర్మతో చేయించి మిగిలిన పాటలకు దేవిశ్రీ ప్రసాద్‌తో ట్యూన్స్‌ చేయించి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను మణిశర్మతో చేయించాలని కొరటాల భావిస్తున్నాడట. అమ్మో.. ఇదంతా ఎటో దారితీసేలా ఉంద‌ని యూనిట్ అనుకుంటోంద‌ట‌. ఇక ఈ విషయంలో చిరంజీవి స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: