అమెరికా.. అగ్ర‌రాజ్యం.. ఈ ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.. అమ్ముల‌పొదిలో అత్యాధునికి టెక్నాల‌జీ.. దేశ‌మంత‌టా ఎన్నో అద్భుతాలు.. ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు పెట్టింది పేరు.. సుమారు 90ఏళ్ల క్రిత‌మే అమెరికా అంతటా ఆకాశాన్ని తాకే భ‌వ‌నాలు.. అలాంటి అద్భుత‌మైన భ‌వ‌నాల్లో మేటి న్యూయార్క్ సిటీలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌.. ఎంపైర్ స్టేట్ భవనం 89 సంవత్సరాల క్రితం అంటే 1931 మే 1వ తేదీన ప్రారంభ‌మైంది. ఆ రోజున భ‌వ‌నం త‌లుపులు తెరుచుకున్నాయి. అప్ప‌ట్లో ఇదొక సంచ‌ల‌నం. ప్ర‌పంచ అద్భుతం.. ప్ర‌పంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌గా గుర్తింపు పొందింది.  

 

102-అంతస్తుల ఆర్ట్ డెకో ఆకాశహర్మ్యం అప్పటి ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా నిలిచింది. 1981దీనిని ల్యాండ్‌మార్క్‌గా గుర్తించారు. ఇప్పుడు ఒక ఐకానిక్ మైలురాయిగా మారింది. తొంభై ఏళ్లు నిండిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అప్ప‌ట్లో తీసిన వీడియో కావ‌డంతో అంద‌రూ ఆస‌క్తిక‌రంగా చూస్తున్నారు. ఆ వీడియోలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్ర‌త్యేక‌త‌ల‌ను చూపుతూ మ‌రికొన్ని అంశాల‌ను జోడించారు. ఈ అద్భుత‌మైన వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి!

మరింత సమాచారం తెలుసుకోండి: