క‌రోనాతో ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోలం అవుతుండ‌గా ఈ మ‌హ‌మ్మారి భారిన‌ప‌డి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అస‌లు క‌రోనా ఎప్పుడు అంత‌మ‌వుతుందో ? ఎవ్వ‌రూ ఊహించ‌ని పరిస్థితి. క‌రోనా ఎలా వ‌స్తుందో ?  ఎలా పోతుందో ?  కూడా ఇప్ప‌ట‌కీ అర్థం కావ‌డం లేదు. మ‌రోవైపు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా మాత్రం ఆగ‌డం లేదు. ఇక క‌రోనాకు చెక్ పెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి కొంద‌రు మాత్రం క‌రోనా ఇప్ప‌ట్లో తగ్గ‌ద‌నే అంటున్నారు.

 

ఇక ప్ర‌పంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ పోతున్నాయి. మ‌న‌దేశంలోనూ ఇప్ప‌టికే మూడో విడ‌త‌గా కూడా లాక్‌డౌన్ పొడిగిస్తూ తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అమెరికా సైంటిస్టులు మాత్రం ఇప్ప‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌ద‌నే చెపుతున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ లేదా మందులు వ‌చ్చే వ‌ర‌కు క‌రోనా వ్యాప్తి జ‌రుగుతూనే ఉంటుంద‌ని చెపుతున్నారు.  క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచంపై రెండేళ్ల వ‌ర‌కు (2022) ఉంటుంద‌ని అమెరికాలోని శాస్త్ర‌వేత్త‌ల బృందం తెలిపింది.

 

ఇక ఈ వేస‌వి త‌ర్వాత శీతాకాలం ప్రారంభ‌మ‌య్యాక క‌రోనా మ‌రింత విజృంభిస్తుంద‌ని మిన్నెసోటా వ‌ర్సిటీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఇన్ఫెక్ష‌న్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాల‌సీ శాస్త్ర‌వేత్త‌ల బృందం నివేదిక చెపుతోంది. శీతాకాంలో ప్ర‌జ‌ల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ని... ఈ క్ర‌మంలోనే శీతాకాలంలో మ‌రింత మందికి కోవిడ్ సోకుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు. ఏదేమైనా ప్ర‌తి రోజు మంచి ఆహారం, ప‌రిశుభ్ర‌త‌, సామాజిక దూరంతోనే క‌రోనాను క‌ట్ట‌డి చేస్తామ‌ని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: