దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనాలకు కంటిమీద కునుకు లేకండా పోతుంది.  ఓ పక్క లాక్ డౌన్ లో వలస కూలీలు, చిన్న తరహా వ్యాపారులు, రైతులు కష్టాలు పడుతుంటే మరోపక్క ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది.  ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాత కష్టాలు మరింత పెరిగిపోయాయి.  ఇదిలా ఉంటే గ్రామాల్లో కృరమృగాల భయం ఒకటి మొదలైంది.  లౌక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు మూతబడిపోయాయి.  రోడ్లు, ఇతర ప్రాంతాలన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.  దాంతో రోడ్లపైకి, గ్రామాల్లోకి కృరమృగాలు రావడం మొదలు పెట్టాయి. తాజాగా లంలోని ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ముగ్గురు రైతులపై ఓ పులి దాడిచేసింది. రైతులు భయపడకుండా తమ వద్ద ఉన్న కర్రలతో పులితో పోరాడారు. 

 

మొత్తానికి వీరి దాడితో ఆ పులి భయపడిపారిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. పొలంలోని ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు ట్రాక్టర్‌పై బయలుదేరారు.  పొలంలో నక్కిన ఆ పులి ఒక్కసారిగా ట్రాక్టర్ పైకి దూకింది. వెంటనే అప్రమత్తమైన రైతులు ట్రాక్టర్‌లో ఉన్న కర్రలతో పులిని ఎదిరించే ప్రయత్నం చేశారు.  ఆ కర్రతో బలంగా కొట్టడంతో పులి కిందపడిపోయింది. కాగా, పులి దాడిలో గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పులి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: