మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ - స‌మంత కాంబినేష‌న్లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా ఎన్ని రికార్డులు, సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే.  2018 లో విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కు తెలుగు సినిమా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సినిమాతో చెర్రీ విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించేసి స్టార్ హీరో అయిపోయాడు.'

 

ఇక ఈ సినిమా ఈ రెండేళ్ల‌లో ఎప్పుడు బుల్లితెర‌మీద ప్ర‌సారం అయినా టీఆర్పీల్లో రికార్డులు పేలిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ అయ్యి ఎన్నెన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ఇత‌ర భాష‌ల్లో కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన రంగ‌స్థ‌లం క‌న్న‌డ‌లో రంగ‌స్థ‌ల పేరుతో రిలీజ్ అయ్యి అక్క‌డ కూడా సూప‌ర్ హిట్ అయ్యింది.

 

రంగ‌స్థ‌ల‌ ఇప్పుడు అక్కడ బుల్లితెర‌పై టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మే 8వ తేదీన అక్క‌డ బుల్లితెర మీద ప్ర‌సారం అవుతోన్న రంగ‌స్థ‌ల స‌రికొత్త టీఆర్పీ రేటింగ్ సాధిస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఏద‌మైనా తెలుగులోనే ఏకంగా రు. 130 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఎక్క‌డో ఓ చోట ఏదో ఒక రికార్డుతో గ‌ట్టిగా రీ సౌండ్ చేస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ ఖాతాలో అనేక రికార్డులు కూడా న‌మోదు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: