దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.  దాంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా భారీగా తగ్గిందని అంటున్నారు.  ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం లేదని అంటున్నారు.   తాజాగా పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది.  లాక్ డౌన్ సందర్భంగా ప్రజలను కాపాడుతున్న పోలీసు అన్యాయంగా చనిపోయిన ఘటన జరిగింది.  లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు విధులు నిర్వహిస్తోన్న పోలీసు అధికారిపై ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు.  

 

పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతంలోని మిల్క్‌బర్ చౌక్ వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కారులో ఓ యువకుడు రోడ్డుపై తిరుగుతున్నాడు. అయితే ఆ కారును ఆపడానికి పోలీస్ అధికారి ప్రయత్నించాడు.. కానీ   కారు ఆపకపోవడమే కాకుండా ఆయనపైకి కారును తీసుకెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే  కారు ముందు భాగంపై ఆ పోలీసు అధికారి పడ్డాడు. దీంతో ఆ యువకుడు కారుని అలాగే కొన్ని మీటర్లు ముందుకు పోనిచ్చాడు.

 

ఇది గమనించిన పోలీస్ సహచరులు వెంటనే పరిగెత్తి వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు.  ఆ యువకుడు కారు ఆపిన వెంటనే అతడిని కొడుతూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని జలంధర్ పోలీసు అధికారి సుర్జీత్ సింగ్ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: