ఇటీవల దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన సాధువుల హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.  మహారాష్ట్రలోని  పాల్గాడ్‌ జిల్లాలో ఇద్దరు సాధవులు హత్యకు పాల్పడ్డ మూకలో ఒకడికి కరోనా పాజిటివ్ అని తేలింది. తీవ్ర అస్వస్థతకు గురైన నిందితుడిని పాల్గర్‌ రూరల్‌ అసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ పై కొందరు మూకదాడి చేసి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని జైలుకు తరలించారు.  ఒకరికి తీవ్ర అస్వస్థతకు గురైన నిందితుడిని పాల్గర్‌ రూరల్‌ అసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

 

రిపోర్టులో అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అధికారులు వెంటనే అతడిని జేజే ఆసుపత్రిలోని ప్రత్యేక జైల్‌ వార్డ్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వాడా పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేగింది.  సాధువులు కల్పవృక్ష గిరిరాజ్‌(70), సుశీల్‌ గిరిరాజ్‌(35)లతో పాటు మరో డ్రైవర్‌ను సదరు గుంపు కర్రలతో, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.   అయితే కేసు విచారణ సమయంలో నిందితుడితో పాటు మరో 20 మందిని పోలీస్ స్టేషన్లోని ఒకే సెల్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఇప్పుడు కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: