ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ను తప్పని సరి చేస్తున్న ఆర్డినెన్స్ పై  హై కోర్ట్ స్టే విధించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ని మొదలు పెట్టకుండా ఉండేలా లేదు. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ వర్గాల (పేరెంట్స్ ) ప్రజలనుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసింది అని చెబుతోంది. ఏపీలో దాదాపుగా 96 శాతం ప్రజలు ఇంగ్లీష్ మీడియం కె మొగ్గు చూపినట్లు వెల్లడించింది.

IHG

 

అయితే మిగతా 4 శాతం వారి పరిస్థితి ఏమిటని మీడియా ప్రశ్నిస్తోంది. తెలుగు మీడియం పాఠ్యాంశం లేకపోతే భవిషత్తులో తెలుగు అంతరించి పోయే ప్రమాదం ఉంది. పక్క రాష్ట్రాలు ప్రాంతీయ భాషతో పటు తెలుగు మాద్యమంను కూడా వారు ప్రోత్సహిస్తున్నారు ఆ కోవలో తమిళ్ నాడు , మహారాష్ట్ర ,కేరళా లు ఉన్నాయ్. మరి వారంతా( తెలుగు మీడియం )  ఏమైపోవాలి. భవిష్యత్తులో ఆ 4% పౌరులు ఇంగ్లీష్ మీడియం చదవలేక చదువుమానేసి రేపు వారు ఏ అసాంఘిక శక్తులుగా మారితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇంగ్లీష్ మీడియం తో పాటుగా తెలుగు ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా ...

మరింత సమాచారం తెలుసుకోండి: