దేశంలో కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి క‌ల‌క‌ల రేపుతోంది. ప్రాణాల‌కు తెగించిపోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇత‌ర సిబ్బంది వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. తాజాగా.. సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు  ట్రూపర్లకు కరోనా సోకడంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉందని అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. రాజధానిలోని మయూర్‌విహార్‌ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లు ఉంటున్నారు.

 

ఈ బెటాలియన్‌కు చెందిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్‌ సోకి సప్థర్‌ జంగ్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్‌ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్‌ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అస‌లు ఇంత‌మందికి వైర‌స్ ఎలా సోకింద‌న్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేద‌ని అధికావ‌ర్గాలు అంటున్నాయి. ఇక‌ ఈ ఘ‌ట‌న‌తో సీఆర్‌పీఎఫ్‌ జ‌వాన్ల కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఏం జ‌రుగుతుందోన‌ని బిక్కుబిక్కుమంటున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: