దేశంలో కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,644 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  83 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. అయితే.. ఒకే రోజు ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి అని పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరిందని తెలిపింది. ఇప్పటివరకు 10,663 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, మొత్తం మరణాల సంఖ్య 1301కి చేరుకుందని తెలిపింది. ఇక‌ ప్రస్తుతం దేశంలో 28,046 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో వివరించింది. ఇక 12 వేల పాజిటివ్‌ కేసులతో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది.

 

దేశంలోని మొత్తం కేసుల్లో పాతిక శాతానికిపైగా కేసులు అక్కడే ఉన్నాయి. అయితే.. ఇక్క‌డ ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమిటంటే..  గత వారం రోజుల వ్యవధిలోనే దేశ‌వ్యాప్తంగా 13 వేల కేసులు, 700 మరణాలు సంభవించాయి. ఇక మూడో దశ లాక్‌డౌన్‌ను మే 3 నుంచి మే 17 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నవిష‌యం తెలిసిందే. పాజిటివ్‌ కేసుల ఆధారంగా ఆయా ప్రాంతాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా కేంద్రం విభజించింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ సడలింపులు ఉండగా.. రెడ్‌ జోన్లలో కఠిన నిబంధనలు కొనసాగనున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: