ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంది.  కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కష్టాలపాలైంది. దేశంలో కరోనా వల్ల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి మద్యం దుకాణాలు బంద్ చేశారు.  అయితే మద్యం షాపులు నడిస్తే ఆర్థికంగా ప్రభుత్వాలకు మంచి ఆదాయం అన్న విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ సడలింపు లో ఇప్పుడు మద్యం అమ్మకాలపై గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ దేశంలో ఏ బిజినెస్ అయినా... నడుస్తుందో లేదో చెప్పలేం గానీ... మద్యం బిజినెస్ మాత్రం తప్పక నడుస్తుంది. 

 

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్‌ మూడో దశ మొదలవుతున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు గేట్లు ఎత్తేసింది. కట్టడి ప్రాంతాలు తప్ప.. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఎక్కడైనా మద్యం విక్రయాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.  కాకపోతే రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసిన కేంద్రం, మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదని పేర్కొంది.

 

దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, ఏ దుకాణం వద్ద కూడా అయిదుగురికి మించి ఉండరాదని పేర్కొంది.  ఇక రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాల్లో మద్యం షాపులకు పరిమిషన్ లేదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్‌ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్‌ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: