పడక సుఖం కోసం పిచ్చెక్కిపోయిన మహిళ సెక్స్ సైకోగా మారింది. భర్త సహకారం కూడా తోడవడంతో ఇద్దరూ కలసి చిన్నారులను లైంగికంగా హిం సించి వికృతానందం పొందేవారు. మహిళ అయి ఉండి అమ్మాయిలతో అసజ శృంగార కలాపాలు సాగించేది. మైనర్ బాలికలను లైంగికంగా హింసించి మరీ పైశాచికానందం పొందేది. రెండేళ్ల‌లో నలుగురు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసింది. మైనర్ బాలికలు, బాలుడిపై భర్తతో కలసి ఆమె చేసిన దారుణాలు బయటపడడంతో  కోర్టు ఏకంగా 75 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

 

అమెరికాలోని ఇలినాయిస్‌కి చెందిన ఆండ్రియా లీస్‌గాంగ్(38), ఆమె భర్త జెరెమి లీస్‌గాంగ్ ఇద్ద‌రూ  సెక్స్ సైకోలుగా మారారు.  2016 నుంచి 2018 మధ్య కాలంలో నలుగురు మైనర్లపై భార్యాభర్తలు లైంగిక దాడుల‌కు పాల్పడ్డారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు కాగా ఒకరు బాలుడు. సెక్స్‌కి బానిసగా మారిన ఆండ్రియా అసహజ శృంగారం కోసం మైనర్ బాలికలను హింసించేది.  దీంతో దంపతులపై నమోదైన అభియోగాలను విచారించిన న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. నిందితులను  జీవితాంతం జైలులో ఉంచాలనిఅభిప్రాయపడింది. ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటూ వారిని జైలు నుంచి విడుదల చేయకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: