కరోనా ప్రభావం చూపుతున్న విషయాన్ని పలు రాష్ట్రాల్లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం సమీక్షించిన తరువాత, రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా ప్రకారం, 130 జిల్లాలు రెడ్ జోన్లుగా, 284 జిల్లాలు ఆరంజ్ జోన్లుగా, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లుగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారిని అనుమతించడానికి గాను కొన్ని గైడ్ లైన్స్ తో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారని వార్త వచ్చింది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి.

 

కాగా,  తెలంగాణలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు 21 నుండి 30 సంవత్సరాల లోపు వారుండటం గమనార్హం. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 29కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స పొందిన తరువాత 499 మందిని డిశ్చార్జ్ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.   

 

రెవెన్యూ, పోలీస్, మెడికల్‌ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్‌లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి.  కాగా, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: