జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. భారత​ జవాన్లను లక్ష్యంగా చేసుకుని భీకర దాడికి చేశారు. ఆదివారం ఉదయం హంద్వారా సమీపంలో దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదురుగు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో సీనియర్‌ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఓ మేజర్‌ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కాల్పులను వెంటనే తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. అయితే.. గత 15 రోజులకుగా కశ్మీర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే.

 

తాజా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మరింత అ‍ప్రమత్తమై ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను అడ్డుకుంటున్నాయి. కాగా, వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ట్విట్ట‌ర్‌లో నివాళుల‌ర్పించారు. *హంద్వారాలో అమరవీరులైన మ‌న‌ సాహసోపేత సైనికులకు భద్రతా సిబ్బందికి నివాళులు. వారి శౌర్యం, త్యాగం ఎప్పటికీ మరచిపోలేం. వారు అత్యంత అంకితభావంతో దేశానికి సేవ చేశారు, మన పౌరులను రక్షించడానికి అవిరామంగా పనిచేశారు. వారి కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం* తెలుపుతూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: