తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో హీరో విజయ్‌ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.  విజయ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి గురించి ఎదురైన ఓ ప్రశ్నకు విజయ్‌ స్పందిస్తూ.. ఫ్యామిలీ లైఫ్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.  పెళ్లికి ఇంకా సమయం ఉందని.. ఇంట్లో కూడా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోమాని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. 

 

సెన్సార్‌ హ్యూమర్‌తోపాటు, దయ గుణం కలిగిన అమ్మాయి అంటే తనకు ఇష్టమని చెప్పారు. తనతో ప్రయాణం బోర్‌ కలిగించకూడదని అన్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్‌.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.  అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైటర్‌ అనే పేరును పరిశీలిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: