దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో లేని ప్రాంతాల్లో దాదాపు 450 మద్యం షాపులను తెరిచేందుకు అనుమతినిచ్చినట్లు కేజ్రివాల్ ప్రభుత్వం తెలిపింది. ఈ షాపులన్నీ విడివిడిగా ఉన్నవని, వీటిలో ఏ ఒక్క షాపు కూడా మాల్స్‌లో కానీ, ఇతర వ్యాపార సముదాయాల్లో కానీ లేదని పేర్కొంది. 

దీనిపై ఢిల్లీ ఎక్సైజ్ శాఖ స్పందిస్తూ, ‘ఢిల్లీ పరిధిలో దాదాపు 545 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 95 దుకాణాల వరకు మాల్స్‌లో ఉన్నాయి. మిగతా 450 వేరువేరుగా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న దుకాణాల వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతిచ్చింద’ని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: