ప్రపంచాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న కరోనా వైర‌స్ మహమ్మారిని పాక్ తన  అవసరాలకు అనుకూలంగా వినియోగించుకుంటోంది. కరోనా రోగులను భారత్‌లోకి చొప్పించాల‌ని పాక్ ప‌థ‌కం రచించింద‌ని  వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జైళ్లలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఖైదీలను విడుదల చేస్తున్న పాక్ పనిలోపనిగా కరుడు గట్టిన ఉగ్రవాది, లష్కరే తయ్యబా చీఫ్ హఫీజ్ సయూద్‌ను కూడా వదిలి పెట్టేసింది. 

 

ఉగ్రవాద కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ అటు భారత్ ఇటు ప్రపంచ దేశాలు ఎన్ని సార్లు కోరినా పాక్ తన పంథాను వీడే ప్రసక్తే లేదన్నట్టు ప్రవర్తిస్తోంది.  లాహోర్ జైల్లో 50 మందికి కరోనా సోకినట్టు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఇటీవల తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటమా లేక ఖైదీల జైళ్లకే పరిమితం చేయడమా అనేది నిర్ణియంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇతర దేశాలు కూడా ఖైదీలను విడుదల చేస్తున్నప్పటికీ ఇలా పొరుగు దేశంపై దాడికి పాల్పడ్డ హఫీజ్ లాంటి కరుడు గట్టిన ఉగ్రవాదిని విడుదల చే యడమేంటని రక్షణ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: