జ‌మ్మూక‌శ్మీర్‌లోని హంద్వారాలో ఈరోజు ఉద‌యం జ‌రిగిన ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన భీక‌ర‌పోరులో అయిదుగురు భార‌త‌ జ‌వాన్లు మృతి చెందారు. దాంట్లో క‌ల్న‌ల్ అశుతోష్, మేజ‌ర్‌ కూడా ఉన్నారు.  భార‌త జ‌వాన్లు కూడా ఎదురుదాడి చేసి ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న‌తో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.  ఈ ఘ‌ట‌నపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. హంద్వారా ఘ‌ట‌న తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఉగ్ర‌వాదుల‌పై పోరాటం చేసేందుకు జ‌వాన్లు అస‌మాన ధైర్య‌సాహ‌సాల‌ను ప్ర‌‌ద‌ర్శించార‌న్నారు. దేశ సేవ కోసం వారు ప్రాణాలు అర్పించిన‌ట్లు ఆ ట్వీట్‌లోపే పేర్కొన్నారు.

 

వారి ధైర్య‌సాహ‌సాల‌ను, త్యాగాల‌ను ఎన్న‌టికీ మ‌ర‌వ‌బోమ‌ని ఆయ‌న పేర్కొ‌న్నారు.  ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళ్లు అర్పిస్తున్న‌ట్లు తెలిపారు. వీర మ‌ర‌ణం పొందిన సైనిక కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అసామాన్య ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తున్న అమ‌ర సైనికుల కుటుంబాల‌కు భార‌త్ ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుందని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఓవైపు క‌రోనా వైర‌స్‌తో తీవ్ర విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదులు దేశంలో క‌ల‌క‌లం రేపేందుకు ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: